Thursday, January 17, 2013

రాయలసీమ భవిష్యత్తు

రాయలసీమ భవిష్యత్తు గురించి రాయలసీమ వాసులు త్రికరణ శుద్ధిగా ఆలోచించి స్పందించ వలసిన తరుణం ఆసన్నమైనది. రాష్ట్ర విభజన తర్వాత మీరు స్పందించినా ప్రయోజనం ఉండదు.
వ్యాపార వర్గానికి చెందిన రాజకీయ నాయకులు తమ స్వీయ ప్రయోజనాల కోసం సామాన్యుల భవిష్యత్తును పణంగా పెడతారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో తమ ఆస్తుల రక్షణే ధ్యేయముగా వీరి చర్చలు కొనసాగుతాయి. తెలంగాణాలో తమ ఆస్తులకు, పరిశ్రమలకు రక్షణ కల్పిస్తామని తెలంగాణా రాజకీయ శక్తుల వద్ద స్పష్టమైన హామీ పొందిన తర్వాత సీమ నాయకులు చర్చలను నీరు కారుస్తారు. ఆస్తుల రక్షణకు వీరు తెలంగాణా శిబిరంలో చేరుతారు. తెలంగాణాలో ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలు గలవారిని రాష్ట విభజన చర్చలకు దూరంగా వుంచడం శ్రేయస్కరం.
చర్చనీయ అంశాలు :
1.అప్పులు 
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వము చేసిన అప్పులను రాష్ట్ర విభజనకు ముందే తీర్చాలి. రాష్ట్రములోని ధనవంతుల ఆస్తులను స్వాధీనము చేసికొని వున్న అప్పులు తీర్చ వలెను. 100 కోట్లకు  పైబడి  వ్యక్తుల వద్ద వున్న స్థిర  చరాస్తులను  జప్తు  చేయాలి. ప్రభుత్వము  చేసిన  అప్పులను  తీర్చడానికి  అవి సరిపోక పోతే, తదుపరి  చర్యగా  50 కోట్లకు  పైబడి  వ్యక్తుల వద్ద వున్న స్థిర  చరాస్తులను  జప్తు  చేయాలి.  అవి చాలక పోతే యింకా  దిగువకు  రావాలి.
2.పెండింగ్ ప్రాజెక్టులు 
   'రాష్ట్రములోని యంత్రములు, కర్మాగారములు, ట్రాక్టర్లు, టిప్పర్లు, బుల్డోజర్లు,  ప్రొక్లేన్లు, లారీలు, బస్సులు, కారులు మరియు యింధనముతో నడిచే అన్ని రకముల పరికరములు ప్రభుత్వము కొరకు సంవత్సరానికి  12 రోజులు ఉచితముగా పనిచేయాలి.' అని  శాసనము  చేయాలి.  వీటికి అవసరమైన యింధనమును ప్రభుత్వము సమకుర్చాలి. ఈ విధానము అమలు వలన నదుల అనుసంధానమునకు, రోడ్లు నిర్మాణమునకు, భవనములు కట్టించడానికి, నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన వొనరులు  సమకూరుతాయి. 

    రాజకీయ నాయకుల మరియు ఉద్యోగుల వుమ్మడి దోపిడీని అరికట్టాలంటే ఓటు హక్కు గల పౌరులు సంవత్సరములో 12 దినములు రాష్ట్ర ప్రభుత్వము కొరకు ఉచితముగా పనిచేయాలి.  ఈ విధానము వలన అనేక ఉపయోగాలున్నాయి.   ప్రభుత్వ కార్యాలయములలో ప్రజలు పని చేయుట వలన అవినీతి పునాదులు కదిలి పోతాయి. రాష్ట్రములోని నదుల అనుసంధానమునకు అవసరమైన మానవ శక్తి లభ్యమౌతుంది.
 3.ప్రభుత్వోద్యోగులు 
ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణముగా వారి సేవకై నియుక్తులైన వారి జీవన ప్రమాణాలు పెరగాలి.