Thursday, January 30, 2014

ఆంధ్రా సీమ ఉద్యమం

 తెలుగు ప్రజలు గర్వించే విధముగా మన ప్రతినిధులు రాష్ట్ర విభజన బిల్లుని తిరస్కరించారు . అందరికి అభినందనలు . ఇది ప్రజా ఉద్యమం .
లాబీయింగ్ పద్ధతిలో రాష్ట్ర విభజన జరగడం దేశానికి అరిష్టం . హిందీ యేతరుల మనోభావాలతో చేలగాటమాడకుండా జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పవలసిన తరుణమిది .
ఆంధ్రా సీమ ఉద్యమం కీలక దశకు చేరింది. తెలుగు వారి భవిష్యత్తుని ఉత్తర భారత లోకసభ సభ్యులు నిర్ణయించ బోతున్నారు. మన హైదరాబాద్ నుండి మనల్ని బైటికి గెంట బోతున్నారు . తెలంగాణాలో నివసించే మన వారు ఆత్మాభిమానాన్ని చంపుకుని జీవించాల్సిన దుర్భర పరిస్థితి రాబోతోంది .
ANDHRA SEEMA warfare-2
ఆంధ్రా సీమ ప్రజలు తమ కొనుగోలు శక్తిని అస్త్రం లా  మార్చి ఉత్తర భారతీయుల పై సంధించాలి .
1. రిటైల్ రంగంలో ఉత్తర భారతీయులు ఆంధ్ర ప్రదేశ్ అంతటా స్థిరపడి పోయారు . వారు అమ్మేవి ఉత్తర భరత్ లో తయారైన వస్తువులే . మనం కొనక పోతే వారు దుకాణాలు మూసుకుంటారు . ఇక్కడ మంట పెడితే రాజస్తాన్ అసెంబ్లీలో సెగ పుట్టాలి .
2. జాతీయ పార్టీలకు  భారీగా చందాలు యిచ్చే కంపెనీలకు సెగ తగలాలి . పెప్సి ,కోలా ఉత్పత్తులను బహిష్కరించండి . చాక్లెట్టులు మార్కెట్ లో కనపడకుండా చేయండి .
3. ఈ విషయాన్ని www.andhraaseema.blogspot.in నుండి download చేసుకుని మీ మిత్రులకు , పరిచయస్తులకు mail చేయండి .  

Friday, October 11, 2013

భారత రాష్ట్ర పతి గారికి బహిరంగ లేఖ

భారత రాష్ట్ర పతి గారికి ,

' మడిసన్నాక కాసంత సిగ్గుండాలి ' అని తెలుగులో నాటు సామెత వుంది . మీ క్యాబినెట్ మంత్రులకు అదే లేదు . ఆ విషయం రాహుల్ గారికి తెలిసే నేరస్తులను రక్షించే ఆర్డినెన్స్ ను చించేసి ఉత్తమ పౌరుల జాబితాలో చేరాడు .
పార్లమెంటు లోకి నేరస్తులకు ఆహ్వానం పలికే ఆర్డినెన్స్ ను ఆమోదించిన మంత్రులకు  ఆంధ్రప్రదేశ్   రాష్ట్రము ను విభజించే నైతిక హక్కు లేదు .
2009 సెప్టెంబర్ లో ముఖ్య మంత్రి రాజ శేఖర రెడ్డి గారు చనిపోతే హొమ్ మంత్రి హోదాలో చిదంబరం డిసెంబర్ మాసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు కాబోతున్నదని  ప్రకటించిన వెంటనే    రాష్ట్ర విభజన కుట్ర కు డిల్లి దర్బారులో రూప కల్పన జరిగిందని తెలుగు ప్రజలు గుర్తించారు . సోనియా గాంధీ అనుమతి పొందడానికి K . చంద్రశేఖర రావు తో నిరాహార దీక్ష నాటకం ఆడించారు .
2014 లోక్ సభ ఎన్నికల తర్వాత అవసరమనిపిస్తే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేయండి. అందుకు సహకరిస్తాం .
అలా కాకుండా హడావిడిగా రాష్ట్ర విభజన చేయడమంటే ఆంధ్రాసీమ ప్రజలను మోసగించడమే .
5 కోట్ల మంది తెలుగు ప్రజలు మీ భారత దేశానికి భారమైతే 'Republic of Andhra Seema ' గా మనుగడ సాగించ డానికి మేము సిద్ధమే . భారత దేశ పౌరులుగా మనుగడ సాగించడం మాకు గర్వమే. కానీ డిల్లి దర్బారుకు సామంత రాజ్య పౌరులుగా మనుగడ సాగించడం తెలుగు మీసాలకు ఇష్టం లేదు .
GOM లో వున్న మీ మంత్రులు మా తెలుగు జాతి శత్రువులుగా మేము భావిస్తున్నాం .

మీ బెంగాలి మనసుకు మా హృదయ ఘోష అర్ధ మౌతుందని ఆశిస్తున్నాను.
Sentiments are more powerful in Kashmir than in Telangana. Indian government had paid heavy penalty by hurting Sikh and Tamil sentiments. It is time for India to rectify the mistakes of past.                                                                                         
                                                                                            భవదీయుడు
                                                                                       బొమ్ము మోహన రెడ్డి
                                                                                      Andhra Seema Vani   

 

Sunday, September 22, 2013

తెలుగు సింహం

నేను భారతీయుడనా కేంద్ర ప్రభుత్వానికి బానిసనా ?

ఈ ప్రశ్న మదిలో ఉదయించిన నాటి నుండి త్రివర్ణ పతాకము విదేశీ జెండా వలె అగుపిస్తోంది . కేంద్ర ప్రభుత్వము సిక్కులను మోసం చేసింది. సిక్కు తుపాకి ఇందిరా గాంధిని బలి తీసుకుంది . కేంద్ర ప్రభుత్వము తమిళులను మోసం చేసింది . తమిళ మానవ బాంబు రాజీవ్ గాంధి ని బలి తీసుకుంది. నేడు కేంద్ర ప్రభుత్వము తెలుగు జాతిని మోసం చేయడానికి సమాయత్త మౌతోంది. తెలుగు వారి కోపానికి భారత దేశము బలి కాపోతోంది . ఆంధ్ర ప్రదేశ్  విభజన భారత దేశ విచ్చిన్నము నకు సంకేతం. ఐదు కోట్ల మందిని వారి రాజధాని నుండి గెంటి వేయడం దేశ బహిష్కరణ శిక్ష లాంటిది. ఈ భారత ప్రభుత్వానికి బానిసలుగా జీవించాల్సిన అధమ స్థితి నుండి బైట పడాలంటే ఆంధ్రా సీమ వాసులు తమ భూ భాగాన్ని రిపబ్లిక్ గా మార్చుకునేందుకు ఉద్యమించాలి.
ఉద్యమ తొలి దశ : ఉత్తర భారతీయుల వ్యాపార సంస్థలను ఆంధ్రా సీమ నుండి బహిష్కరించండి.
            చిదంబరం మంత్రిగా కొనసాగుతున్నంత కాలం తమిళనాడు నుండి వస్తువులను దిగుమతి చేసుకో రాదు .
            పెప్సీ' కోలా ఉత్పత్తులను నిషేధించండి.
                                                                                    బొమ్ము మోహన రెడ్డి

                                                                  తెలుగు సింహం

Tuesday, September 10, 2013

ఆంధ్రా సీమ ఉద్యమం

ఆంధ్రా సీమ  ఉద్యమం
ఒక దేశం సమైక్యముగా మనుగడ సాగించాలంటే కొన్ని నియమాలు పాటించాలి . దేశాధినేతలు మారినా పాలసీలలో స్థిరత్వం వుండాలి. వ్యాపార వర్గం పాలకులను శాసించే స్థాయికి ఎదగ కూడదు. ప్రభుత్వము తమను మోసగిస్తున్నదన్న భావన ప్రజలలో తలెత్త కూడదు.
1969 లో తెలంగాణా రాష్ట్రమును ఏర్పాటు చేసి వుండాల్సింది. 1973 లో ఆంధ్రా సీమ రాష్ట్రమును ఏర్పాటు చేసి వుంటే బాగుండేది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి  హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత హడావిడిగా 'తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం ' అంటూ 2009 లో చిదంబరం ప్రకటించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
100 కోట్లు ముడుపులుగా స్వీకరించి కేంద్ర ప్రభుత్వం లోని కీలక వ్యక్తులు తెలుగు రాష్ట్రాన్ని విభజించడానికి సిద్ధ పడినారని ఆంధ్రా సీమ ప్రజలు గ్రహించి తిరగబడ్డారు. శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటు ద్వారా ఆంధ్రా సీమ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చారు. తీసుకున్న ముడుపులకు ప్రతిగా అధికారాన్ని కోల్పోవడానికి కొద్ది మాసాల ముందు 2013 లోనే తెలంగాణా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు .
షిండే , దిగ్విజయ్ , చిదంబరం , ఆంథోని - ఇది దుష్ట చతుష్టయం.
ఉద్యమం పేరున సామాన్యులను శిక్షించడం సరైన పద్ధతి కాదు .
ఉత్తరాదికి చెందిన వ్యాపారస్తుల వద్ద ఏ వస్తువులు కొనకండి .
తమిళనాడు నుండి వస్తువుల దిగుమతులను ఆపండి .
పెప్సీ , కోలా పానీయాలను బహిష్కరించండి .
అన్ని కంపెనీల కారుల అమ్మకాలు నిలిపేయండి.
దుష్ట చతుష్టయం కేంద్ర మంత్రి వర్గం లో కొనసాగినంత కాలం ఎన్నికలను బహిష్కరించండి
మోహన
ఆంధ్రా సీమ ప్రజా పరిషత్

Sunday, August 18, 2013

ఆంధ్రా సీమ ప్రజా పరిషత్

 ఆంధ్రా సీమ ప్రజా పరిషత్
తెలంగాణా ప్రజలు వేరు కుంపటి పెట్టుకుంటా మంటే ఆంధ్రా సీమ ప్రజలు అభ్యంతరం చెప్పడం సబబు కాదు. అలాగే తెలంగాణా వాదులు హైదరాబాద్ తమ స్వంతమే అనడము సబబు కాదు . గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చకుండా రాష్ట్రాన్ని విభజించడం తప్పు .
కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందన్న భావన ఆంధ్రా సీమ ప్రజలలో బలంగా వుంది .  

Tuesday, August 13, 2013

ఆంధ్రా సీమ ఉద్యమానికి ఊపిరి

ఆంధ్రా సీమ ఉద్యమానికి ఊపిరి
ఉద్యమం అంటే మనల్ని మనం హింసించు కోవడం కాదు . ఉద్యమం అంటే బందులు రాస్తా రోకోలు కాదు .
ఉద్యమం అంటే అగ్ని గోళం . దాని అగ్ని కీలల్ని చూడాలంటే ప్రత్యర్ధుల గుండెల్లో దడ పుట్టాలి. ఉద్యమ సెగల్లోంచి నాయకులు పుట్టుకొస్తారు . ఆంధ్రా సీమ ప్రజల సత్తా ప్రపంచానికి చాటాలి.
ఉద్యమ నినాదం 'జై ఆంధ్రా జై సీమ '
మన ఆత్మాభిమానాన్ని కించ పరిచే విధముగా మాట్లాడే వారితో సహజీవనం ప్రగతికి విఘాతం.

Saturday, August 10, 2013

ఆంధ్రా సీమ రక్షణ సమితి

1. ఆంధ్రా సీమ రాష్ట్రము కొరకు పోరాడండి .2.రాష్ట్రమును సమైక్యముగా ఉంచమని గాని, విభజించమని గాని కోరే హక్కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వోద్యోగులకు లేదు. వీరి సమ్మె ప్రజా వ్యతిరేకం.  వీరు సిగ్గు లేకుండా సమ్మె కాలానికి వేతనం అడుగుతారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగము అవినీతి పరులతో నిండి పోయింది. ఆ ఉద్యోగులు మనకు వద్దు.
3.కాంట్రాక్టుల పేరుతో ప్రజా ధనాన్ని రాజకీయ నాయకులు, అధికారులు , కాంట్రాక్టర్లు కలిసి లూటీ చేసిన వైనం ప్రజలకు తెలుసు. కావున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము చేసిన అప్పులతో ఆంధ్రా సీమ రాష్ట్రము నకు సంబంధము లేదు.
హైదరాబాద్ ను అమ్మి అప్పులు తీర్చు కో వచ్చు .
4.విద్యార్ధులు ఒక సంవత్సర కాలం క్లాసులు బహిష్కరించాలి. మన ఆంధ్రాసీమ రాష్ట్రము ఏర్పడిన తరువాత పరీక్షలు వ్రాయకుండానే పై తరగతికి ప్రోమోట్ చేయబడతారు .
5.గురువారం రోజు ఆంధ్రాసీమ రాష్ట్రము నుండి తెలంగాణా రాష్ట్రము వైపు వెళ్ళే దారుల్లో 'సడక్ బంద్ ' చేయండి.
6. హైదరాబాద్ లో తయారైన వస్తువులను బహిష్కరించండి . హైదరాబాదు కు ఆహార పదార్దముల ఎగుమతులను నిలుపుదల చేయండి .
7. మన విద్యార్ధులకు హిందీ బోధనను నిలుపు చేయండి .