Tuesday, September 10, 2013

ఆంధ్రా సీమ ఉద్యమం

ఆంధ్రా సీమ  ఉద్యమం
ఒక దేశం సమైక్యముగా మనుగడ సాగించాలంటే కొన్ని నియమాలు పాటించాలి . దేశాధినేతలు మారినా పాలసీలలో స్థిరత్వం వుండాలి. వ్యాపార వర్గం పాలకులను శాసించే స్థాయికి ఎదగ కూడదు. ప్రభుత్వము తమను మోసగిస్తున్నదన్న భావన ప్రజలలో తలెత్త కూడదు.
1969 లో తెలంగాణా రాష్ట్రమును ఏర్పాటు చేసి వుండాల్సింది. 1973 లో ఆంధ్రా సీమ రాష్ట్రమును ఏర్పాటు చేసి వుంటే బాగుండేది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి  హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత హడావిడిగా 'తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం ' అంటూ 2009 లో చిదంబరం ప్రకటించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
100 కోట్లు ముడుపులుగా స్వీకరించి కేంద్ర ప్రభుత్వం లోని కీలక వ్యక్తులు తెలుగు రాష్ట్రాన్ని విభజించడానికి సిద్ధ పడినారని ఆంధ్రా సీమ ప్రజలు గ్రహించి తిరగబడ్డారు. శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటు ద్వారా ఆంధ్రా సీమ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చారు. తీసుకున్న ముడుపులకు ప్రతిగా అధికారాన్ని కోల్పోవడానికి కొద్ది మాసాల ముందు 2013 లోనే తెలంగాణా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు .
షిండే , దిగ్విజయ్ , చిదంబరం , ఆంథోని - ఇది దుష్ట చతుష్టయం.
ఉద్యమం పేరున సామాన్యులను శిక్షించడం సరైన పద్ధతి కాదు .
ఉత్తరాదికి చెందిన వ్యాపారస్తుల వద్ద ఏ వస్తువులు కొనకండి .
తమిళనాడు నుండి వస్తువుల దిగుమతులను ఆపండి .
పెప్సీ , కోలా పానీయాలను బహిష్కరించండి .
అన్ని కంపెనీల కారుల అమ్మకాలు నిలిపేయండి.
దుష్ట చతుష్టయం కేంద్ర మంత్రి వర్గం లో కొనసాగినంత కాలం ఎన్నికలను బహిష్కరించండి
మోహన
ఆంధ్రా సీమ ప్రజా పరిషత్

No comments:

Post a Comment