Sunday, August 18, 2013

ఆంధ్రా సీమ ప్రజా పరిషత్

 ఆంధ్రా సీమ ప్రజా పరిషత్
తెలంగాణా ప్రజలు వేరు కుంపటి పెట్టుకుంటా మంటే ఆంధ్రా సీమ ప్రజలు అభ్యంతరం చెప్పడం సబబు కాదు. అలాగే తెలంగాణా వాదులు హైదరాబాద్ తమ స్వంతమే అనడము సబబు కాదు . గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చకుండా రాష్ట్రాన్ని విభజించడం తప్పు .
కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందన్న భావన ఆంధ్రా సీమ ప్రజలలో బలంగా వుంది .  

Tuesday, August 13, 2013

ఆంధ్రా సీమ ఉద్యమానికి ఊపిరి

ఆంధ్రా సీమ ఉద్యమానికి ఊపిరి
ఉద్యమం అంటే మనల్ని మనం హింసించు కోవడం కాదు . ఉద్యమం అంటే బందులు రాస్తా రోకోలు కాదు .
ఉద్యమం అంటే అగ్ని గోళం . దాని అగ్ని కీలల్ని చూడాలంటే ప్రత్యర్ధుల గుండెల్లో దడ పుట్టాలి. ఉద్యమ సెగల్లోంచి నాయకులు పుట్టుకొస్తారు . ఆంధ్రా సీమ ప్రజల సత్తా ప్రపంచానికి చాటాలి.
ఉద్యమ నినాదం 'జై ఆంధ్రా జై సీమ '
మన ఆత్మాభిమానాన్ని కించ పరిచే విధముగా మాట్లాడే వారితో సహజీవనం ప్రగతికి విఘాతం.

Saturday, August 10, 2013

ఆంధ్రా సీమ రక్షణ సమితి

1. ఆంధ్రా సీమ రాష్ట్రము కొరకు పోరాడండి .2.రాష్ట్రమును సమైక్యముగా ఉంచమని గాని, విభజించమని గాని కోరే హక్కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వోద్యోగులకు లేదు. వీరి సమ్మె ప్రజా వ్యతిరేకం.  వీరు సిగ్గు లేకుండా సమ్మె కాలానికి వేతనం అడుగుతారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగము అవినీతి పరులతో నిండి పోయింది. ఆ ఉద్యోగులు మనకు వద్దు.
3.కాంట్రాక్టుల పేరుతో ప్రజా ధనాన్ని రాజకీయ నాయకులు, అధికారులు , కాంట్రాక్టర్లు కలిసి లూటీ చేసిన వైనం ప్రజలకు తెలుసు. కావున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము చేసిన అప్పులతో ఆంధ్రా సీమ రాష్ట్రము నకు సంబంధము లేదు.
హైదరాబాద్ ను అమ్మి అప్పులు తీర్చు కో వచ్చు .
4.విద్యార్ధులు ఒక సంవత్సర కాలం క్లాసులు బహిష్కరించాలి. మన ఆంధ్రాసీమ రాష్ట్రము ఏర్పడిన తరువాత పరీక్షలు వ్రాయకుండానే పై తరగతికి ప్రోమోట్ చేయబడతారు .
5.గురువారం రోజు ఆంధ్రాసీమ రాష్ట్రము నుండి తెలంగాణా రాష్ట్రము వైపు వెళ్ళే దారుల్లో 'సడక్ బంద్ ' చేయండి.
6. హైదరాబాద్ లో తయారైన వస్తువులను బహిష్కరించండి . హైదరాబాదు కు ఆహార పదార్దముల ఎగుమతులను నిలుపుదల చేయండి .
7. మన విద్యార్ధులకు హిందీ బోధనను నిలుపు చేయండి .

  

Saturday, August 3, 2013

విద్యార్ధులకు సూచనలు
1. సమైక్య నినాదం విడనాడండి. రాష్ట్రము యింకా విడిపోలేదు . ఆంధ్రా సీమ విద్యార్ధుల అనుమతి లేకుండా తెలుగునాట ఎన్నికలు జరుగవు , ప్రభుత్వాలు నడవవు . తెలంగాణా ప్రజలు విడిపోవాలంటే విభజనే లక్ష్యముగా ఏర్పడిన TRS ను ఏక పక్షముగా గెలిపించి వుండే వారు . రాజకీయములో సెంటిమెంటు గురించి మాట్లాడడం అవివేకం . భారత దేశం నుండి విడిపోవాలని కాశ్మీరు లో సెంటిమెంటు బలంగా వుంది . Democracy requires a clear verdict not sentiment. దిగ్విజయ్ సింగ్ కి భారీగా ముడుపులు ముట్టాయి . అతడు క్రిమినల్ . తెలుగు జాతి అతనిని శిక్షించి తీరాలి .
2. విద్యార్ధులు సుదీర్ఘ పోరాటానికి సిద్ధ పడాలి . సంవత్సర కాలం తరగతులను బహిష్కరించండి . పరీక్షలు వ్రాయకుండానే పై తరగతికి ప్రమోట్ చేయబడతారు . గ్రామీణ విద్యాలయాలను మూయించండి .
3. 

ఆంధ్రా సీమ రాష్ట్రము

ఆంధ్రా సీమ రాష్ట్రము
జై ఆంధ్రా ఉద్యమం చల్లారిన  40 సంవత్సరాల తర్వాత తెలుగు ప్రజలను ఉత్తరాది వెధవలు చీలుస్తున్నారు . కాంగ్రెస్ అనగా సోనియా భజన సమాజం . భజన చేసే గొర్రెలను సలహా అడిగేదేముందిలే అని ఇటాలియన్ బుర్ర చక చకా నిర్ణయం తీసుకుంది . ఇప్పుడు గొర్రెలు రాజీనామా చేస్తా మని ఏడుస్తున్నాయి . వీరు ఇప్పుడు రాజీనామా చేస్తారు . ఉద్యమం వేడి తగ్గగానే రాహుల్ గాంధి ముందు మోకరిల్లుతారు . కొత్త రాష్ట్రము కొరకు ఇచ్చే నిధులను కాజేయడానికి పోటీ పడతారు .
BJP ని భారతీయ చవటల పార్టీగా పిలవాలి .
TDP తెలుగు ద్రోహుల పార్టీగా పిలవాలి .
ఆంధ్రాసీమ రాష్ట్రము నుండి గొర్రెల కాంగ్రెస్ తో సహా TDP, BJP లను శాశ్వతముగా వెలివేయాలి .