Friday, October 11, 2013

భారత రాష్ట్ర పతి గారికి బహిరంగ లేఖ

భారత రాష్ట్ర పతి గారికి ,

' మడిసన్నాక కాసంత సిగ్గుండాలి ' అని తెలుగులో నాటు సామెత వుంది . మీ క్యాబినెట్ మంత్రులకు అదే లేదు . ఆ విషయం రాహుల్ గారికి తెలిసే నేరస్తులను రక్షించే ఆర్డినెన్స్ ను చించేసి ఉత్తమ పౌరుల జాబితాలో చేరాడు .
పార్లమెంటు లోకి నేరస్తులకు ఆహ్వానం పలికే ఆర్డినెన్స్ ను ఆమోదించిన మంత్రులకు  ఆంధ్రప్రదేశ్   రాష్ట్రము ను విభజించే నైతిక హక్కు లేదు .
2009 సెప్టెంబర్ లో ముఖ్య మంత్రి రాజ శేఖర రెడ్డి గారు చనిపోతే హొమ్ మంత్రి హోదాలో చిదంబరం డిసెంబర్ మాసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు కాబోతున్నదని  ప్రకటించిన వెంటనే    రాష్ట్ర విభజన కుట్ర కు డిల్లి దర్బారులో రూప కల్పన జరిగిందని తెలుగు ప్రజలు గుర్తించారు . సోనియా గాంధీ అనుమతి పొందడానికి K . చంద్రశేఖర రావు తో నిరాహార దీక్ష నాటకం ఆడించారు .
2014 లోక్ సభ ఎన్నికల తర్వాత అవసరమనిపిస్తే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేయండి. అందుకు సహకరిస్తాం .
అలా కాకుండా హడావిడిగా రాష్ట్ర విభజన చేయడమంటే ఆంధ్రాసీమ ప్రజలను మోసగించడమే .
5 కోట్ల మంది తెలుగు ప్రజలు మీ భారత దేశానికి భారమైతే 'Republic of Andhra Seema ' గా మనుగడ సాగించ డానికి మేము సిద్ధమే . భారత దేశ పౌరులుగా మనుగడ సాగించడం మాకు గర్వమే. కానీ డిల్లి దర్బారుకు సామంత రాజ్య పౌరులుగా మనుగడ సాగించడం తెలుగు మీసాలకు ఇష్టం లేదు .
GOM లో వున్న మీ మంత్రులు మా తెలుగు జాతి శత్రువులుగా మేము భావిస్తున్నాం .

మీ బెంగాలి మనసుకు మా హృదయ ఘోష అర్ధ మౌతుందని ఆశిస్తున్నాను.
Sentiments are more powerful in Kashmir than in Telangana. Indian government had paid heavy penalty by hurting Sikh and Tamil sentiments. It is time for India to rectify the mistakes of past.                                                                                         
                                                                                            భవదీయుడు
                                                                                       బొమ్ము మోహన రెడ్డి
                                                                                      Andhra Seema Vani   

 

No comments:

Post a Comment